News January 30, 2025
సంగారెడ్డి: స్టాక్ మార్కెట్ పేరిట రూ.25.17 లక్షల మోసం

నకిలీ స్టాక్ మార్కెట్ పేరిట భారీ మొత్తంలో వ్యాపారి మోసపోయిన ఘటనపై అమీన్ పూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. మున్సిపాలిటీలోని ఓ వ్యాపారికి గతేడాది Oct 8న వాట్సప్‌కు స్టాక్ మార్కట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని లింక్ మెసేజ్ రావడంతో రూ.25.17 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి ఇవ్వాలనడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Similar News
News November 3, 2025
విస్తృతంగా పర్యటించిన GWMC మేయర్, కమిషనర్

గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ పరిధిలోని చిన్నవడ్డెపల్లి చెరువు కట్ట, టీచర్స్ కాలనీ, ఇతర కాలనీలలో మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించారు. తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలలోకి ఇండ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రజలను ఆదుకోవాలని మేయర్, కమిషనర్లను స్థానిక కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి కోరుతూ వినతి పత్రం అందజేశారు.
News November 3, 2025
అడవి పందుల కోసం వేట.. ఇద్దరి మృతి

బంగారుపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బండ్లదొడ్డి గ్రామపంచాయతీలో వన్య ప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఒక అడవి పంది కూడా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 3, 2025
చెర్వుగట్టు ఆలయ అభివృద్ధిపై మంత్రి సురేఖ సమీక్ష

నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.


