News October 7, 2025
సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎస్పీ

పోలీసు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసిన చర్య తీసుకోవాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
గ్రూప్-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ

TG: గ్రూప్-1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు <<17813238>>ఆదేశాలపై<<>> స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పే ఇచ్చినందున జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
News October 7, 2025
‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు.
News October 7, 2025
సుజాతనగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.