News August 28, 2025

సంగారెడ్డి: స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవాలి

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సెప్టెంబర్ 15లోగా పాఠశాలల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అధికారులు పాఠశాలలను పరిశీలించిన అనంతరం, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను ప్రకటిస్తారని పేర్కొన్నారు.

Similar News

News August 28, 2025

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మూలపురుషుడు ఎవరో తెలుసా?

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలపురుషుడిగా ముక్త్యాల రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ పేరుగాంచారు. జగ్గయ్యపేట సంస్థానంలోని ముక్త్యాల సంస్థానాధీశుడైన ఆయన, నాటి దట్టమైన అడవి ప్రాంతమైన నందికొండలో సాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాల భూమిని దానం చేసి, రూ. లక్షలాది వెచ్చించారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా పాలకులను ఒప్పించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కీలకపాత్ర పోషించారు.

News August 28, 2025

బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2’ మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో పోస్ట్‌పోన్ చేయక తప్పడం లేదని వివరించింది. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

News August 28, 2025

KMR: వరద ప్రాంతాలను పరిశీలించిన అగ్నిమాపక శాఖ డీజీ

image

కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు స్పందన విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి గురువారం కామారెడ్డిలో పర్యటించారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హన్మంత్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితి, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.