News July 5, 2025
సంగారెడ్డి: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

గరిష్ట ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.
Similar News
News July 5, 2025
ఈ శతాబ్దపు అత్యుత్తమ మూవీ ‘పారాసైట్’: న్యూయార్క్ టైమ్స్

ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ చిత్రంగా కొరియన్ మూవీ ‘పారాసైట్’ నిలిచింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన 21వ శతాబ్దంలోని టాప్-100 చిత్రాల్లో తొలి స్థానం దక్కించుకుంది. మూన్ లైట్, డార్క్ నైట్, వాల్-ఈ వంటి చిత్రాలతో పోటీ పడటం గమనార్హం. 2019లో రిలీజైన ‘పారాసైట్’కు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు పొందిన నాన్-ఇంగ్లిష్ మూవీ ఇదే. మీరు ఈ మూవీ చూశారా?
News July 5, 2025
సాంకేతిక నైపుణ్యతలు పెంపొందించుకోవాలి: ఎస్పీ

ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఫ్యాక్షన్ గ్రామాలలో గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. సిబ్బందికి లెదర్ బ్యాగులు పంపిణీ చేశారు.
News July 5, 2025
ఖమ్మం: పరీక్షల్లో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి SUICIDE

పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బీటెక్ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వల్లాపురానికి చెందిన ఇండేమందల యశ్వంత్(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు రాసి కిష్టాపురంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.