News November 20, 2025

సంగారెడ్డి: 10 పరీక్ష ఫీజు.. నేడే చివరి తేదీ: డీఈవో

image

పదో తరగతి పరీక్ష ఫీజు గురువారం చివరి తేది అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని పాఠశాలలకు కలిపి రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. పరీక్షా ఫీజును నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, గడువు పొడిగించమని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.

Similar News

News November 20, 2025

విజయవాడ: రెచ్చిపోతున్న రేషన్ మాఫియా డాన్.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేదల బియ్యాన్ని దేశ సరిహద్దులు దాటించే రేషన్ మాఫియా డాన్ ఆగడాలు శృతిమించుతున్నాయి. నియోజకవర్గానికి ఒకరు చొప్పున నియమించుకొని బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు సైతం నెలకు రూ.7 నుంచి రూ. 10 లక్షల వరకు ఈ మాఫియా డాన్ అవినీతి సొమ్మును ముట్ట చెబుతున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో అధికారులు కన్నెత్తైనా చూడలేకపోతున్నారు.

News November 20, 2025

మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

image

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్‌లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News November 20, 2025

ఏపీకి మళ్లీ వర్ష సూచన

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. తర్వాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఆదివారం వరకు ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.