News August 22, 2025
సంగారెడ్డి: 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

కూకట్‌పల్లిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 22, 2025
FLASH: శామీర్‌పేట్ చెరువులో యువకుడి మృతదేహం కలకలం

శామీర్‌పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు. మృతుడు చెరుకూరి రసూల్(25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నట్లు చెప్పారు.
News August 22, 2025
కడప జేసీ కీలక ఆదేశాలు

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.
News August 22, 2025
కోటపల్లి: కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారు: మంత్రి

BRS ప్రభుత్వం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కోటపల్లి మండలంలో పర్యటించి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రైతులు బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నారని అన్నారు. మంత్రి ఉత్తమ్‌ను ఇక్కడ జరిగిన వాటిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు కరకట్టలు కట్టాలని మంత్రిని కోరామన్నారు.