News January 2, 2026

సంగారెడ్డి: 1,492 మంది కుష్టు అనుమానితులు

image

సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 18 నుంచి 31వ తేదీ వరకు కుష్టు వ్యాధి సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు శుక్రవారం తెలిపారు. 1,492 మంది కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించినట్లు చెప్పారు. 9 మందికి వ్యాధిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి సర్వే చేసినట్లు చెప్పారు.

Similar News

News January 8, 2026

కాకినాడలో రూ.20 కోట్లతో సానా సతీష్ బాబు స్కిల్ హబ్

image

రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ రూ.20 కోట్లతో కాకినాడలో స్కిల్ హబ్, ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలి విడతగా తన MP నిధుల నుంచి రూ.5.3 కోట్లు విడుదల చేయగా కలెక్టర్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. CM చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తయారుచేయులనే లక్ష్యంతో మంత్రి లోకేశ్ తెస్తున్న కంపెనీలకు యువతను అందించడమే లక్ష్యంగా ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News January 8, 2026

ఆ వార్త చదివి గుండె బద్దలైంది: శిఖర్ ధావన్

image

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై సామూహిక దాడి ఘటనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ వార్త చదివి గుండె బద్దలైంది. ఎవరిపైన అయినా, ఎక్కడైనా హింస ఆమోదయోగ్యం కాదు. బాధితురాలికి న్యాయం జరగాలి” అని ట్వీట్ చేశారు. కాగా ఇద్దరు వ్యక్తులు ఓ 40 ఏళ్ల హిందూ వితంతువును రేప్ చేసి, ఆమె జుట్టు కత్తిరించి, చెట్టుకు కట్టేసి టార్చర్ చేశారు. ఈ వీడియో SMలో <<18770990>>వైరల్‌<<>> అవుతోంది.

News January 8, 2026

ప్రపంచ పర్యాటక కేంద్రంగా సూర్యలంక బీచ్: కలెక్టర్

image

సూర్యలంక బీచ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు స్వదేశీ దర్శన్ 2.O కింద రూ.97 కోట్లతో పనులు ప్రారంభించామని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. బీచ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
పనుల వేగం, నాణ్యతపై సూచనలు చేశారు. పనులన్నీ సెప్టెంబర్‌లోపు పూర్తి చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఫిష్ ఆంధ్ర షాపుల సమస్యలు, గిరిజనుల పునరావాసంపై న్యాయం చేస్తామన్నారు.