News September 13, 2025

సంగారెడ్డి: 15న T-SAT ద్వారా ప్రత్యక్ష ప్రసారం

image

ఈనెల 15వ తేదీన T-SAT ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రాథమిక విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటలకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతారని పేర్కొన్నారు.

Similar News

News September 13, 2025

మంచిర్యాల జిల్లాలో 29.3 మి.మీ వర్షపాతం

image

గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 29.3మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నెన్నెల మండలంలో 89.6 వర్షపాతం నమోదు కాగా.. జన్నారంలో 19.8, దండేపల్లి 11.2, లక్షెట్టిపేట13, హాజీపూర్28.8, కాసిపేట77.6, తాండూర్18.2, భీమిని9.6, కన్నేపల్లి7.2, వేమనపల్లి30.4, బెల్లంపల్లి47.4, మందమర్రి58.2, మంచిర్యాల 24.2, నస్పూర్16.6, జైపూర్ 9.4, భీమారం 14.4, చెన్నూర్ 38.6, కోటపల్లిలో 23.8మి.మీ నమోదైంది.

News September 13, 2025

మేం ఏ జట్టునైనా ఓడిస్తాం: పాక్ కెప్టెన్

image

తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. భారత్‌తో మ్యాచ్ గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌లో ఇంకా బెటర్ అవ్వాలి. ఇటీవల మా ఆటతీరు బాగుంది. ట్రై సిరీస్‌ను కూడా ఈజీగా విన్ అయ్యాం’ అని ఒమన్‌తో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించారు. ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా రేపు భారత్, పాక్ తలపడనున్న విషయం తెలిసిందే.

News September 13, 2025

NLG: రజాకార్ల మారణకాండకు 79 ఏళ్లు

image

రజాకారులు సృష్టించిన మారణ హోమానికి సజీవ సాక్ష్యం వల్లాల గ్రామం. 1948 ఆగస్టు15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తుండగా గ్రామంపై దండెత్తిన రజాకారులు అమానుష హత్యాకాండకు తెగబడ్డారు. పాఠశాల ప్రాంగణంలోనే పది మందిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనకు 79 ఏళ్లు నిండాయి.