News September 15, 2025
సంగారెడ్డి: 17 నుంచి మహిళలకు వైద్య శిబిరాలు

స్వాస్త్ నారి- స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల తెలిపారు. 15 రోజులపాటు ప్రతిరోజు 10 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News September 15, 2025
దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్

దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ జట్టు నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్‌పై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో సెంట్రల్ జోన్ ప్లేయర్స్ యశ్ రాథోడ్(194), కెప్టెన్ పాటీదార్(101) సెంచరీలతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సారాన్ష్ జైన్(8 వికెట్లు, 69 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా యశ్ (194, 13 రన్స్) నిలిచారు. స్కోర్లు: సౌత్ జోన్ 149&426, సెంట్రల్ జోన్ 511&66/4.
News September 15, 2025
త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: మంత్రి అనగాని

AP: భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News September 15, 2025
KNR: వారికోసం రూ.8వేల కోట్లు చెల్లించలేదా?: బండి

ఫీజు రీయంబర్స్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని చంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షల విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ సుందరీకరణ, 4th సిటీ, మిస్ వరల్డ్ పోటీలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి లక్షల విద్యార్థుల భవిష్యత్తు కన్పించట్లేదా? వారికోసం రూ.8వేల కోట్లను చెల్లించలేదా? అని ప్రశ్నించారు.