News April 15, 2025

సంగారెడ్డి: 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీర్గాపూర్ మండలం కడపలో 41.1 డిగ్రీలు నమోదు కాగా.. పటాన్ చెరు మండలం పాశమైలారంలో 40.8, చౌటకూరు, జిన్నారం, కోహీర్ మండలం దిగ్వాల్ 40.7, కల్హేర్, ఖేడ్ 40.6, వట్టిపల్లి, పుల్కల్ 40.5, వట్టిపల్లి మండలం పాల్వంచ 40.4, జహీరాబాద్, కంగ్టి, హత్నూర మండలం గుండ్ల మాచనూరు 40.3 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News April 18, 2025

TTD ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి

image

AP: గోశాలలో గోవుల మరణంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘టీటీడీ పాలన అధ్వానంగా ఉంది. గోవుల మరణం వెనుక కుట్ర ఉంది. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఈ దారుణం జరిగింది. వయసు పెరిగి గోవులు చనిపోయాయంటున్నారు. మీరు చనిపోతే కూడా మిమ్మల్ని వదిలేయాలా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 18, 2025

కాసేపట్లో వర్షం!

image

TG: పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, MBNR, నారాయణపేట్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.

News April 18, 2025

TTD ఈవో బంగ్లాలో నాగుపాము హల్‌చల్ 

image

తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో రాత్రి నాగుపాము హల్‌చల్ చేసింది. పామును పట్టేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడును తీసుకు వచ్చారు. ఆయన పామును పట్టి గొనె సంచెలో వేస్తుండగా చేతిపై కాటేసింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయనను స్విమ్స్‌కు తరలించారు‌. ప్రస్తుతం రవీందర్ నాయుడు కోలుకుంటున్నారు.

error: Content is protected !!