News August 17, 2025
సంగారెడ్డి: 20 నుంచి మండల స్థాయి పోటీలు: డీఈఓ

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి పది రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
Similar News
News August 17, 2025
నరసరావుపేట: మూడు రోజులే దరఖాస్తుకు అవకాశం

విద్యా హక్కు చట్టంలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ ఆదివారం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి https://cse.ap.gov.in/లో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలన్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు పాఠశాలలే వెబ్సైట్‌లో కనిపిస్తాయని, 20% కోటా అందుబాటులో ఉన్న సీట్లు డిస్‌ప్లే అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News August 17, 2025
గుంటూరు: GGHలో వాహనాల చోరీకి చెక్

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాల చోరీ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని ద్వారా ఆసుపత్రి స్వాగతద్వారంలోనే వాహనంతో పాటూ సంబంధిత వాహన యజమానికి RFID ట్యాగ్ వేసి వాహనాల చోరీని అరికట్టనున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
News August 17, 2025
హాకీ జట్టు కెప్టెన్‌గా మదనపల్లె యువకుడు

మదనపల్లెకు చెందిన అఖిల్ వెంకట్‌కు అరుదైన అవకాశం వచ్చింది. హాకీ పురుషుల జూనియర్ విభాగం రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో త్వరలో జాతీయస్థాయి హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. అందులో మన జట్టును అఖిల్ వెంకట్ ముందు ఉండి నడిపించనున్నాడు.