News March 12, 2025

సంగారెడ్డి: 20 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్: డీఈవో

image

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 16, లాంగ్వేజ్ పండిత్ ముగ్గురు, పీఈటీ ఒకరిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులరైజ్ పత్రాలు ఆయా టీచర్లకు అందజేస్తామని చెప్పారు. డీఈవో నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News September 14, 2025

MDK: రూ.1,04,88,964 రికవరీ

image

లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బులు, విలువైన సమయం ఆదా అవుతుందని, రాజీతో ఇద్దరూ గెలిచినట్లే అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తులు అన్నారు. MDKలో 4,987 కేసులు, SRDలో 4,334, SDPTలో 3,787 కేసులు పరిష్కారించినట్లు వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్& డ్రైవ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, E-పిట్టీ కేసులు, తగాదాలు తదితర కేసులను రాజీ కుదిర్చామన్నారు. MDKలో రూ.1,04,88,964 రికవరీ చేశారు.

News September 14, 2025

వరి: సెప్టెంబర్‌లో ఎరువుల యాజమాన్యం ఇలా..

image

తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు దాదాపు <<17675869>>పూర్తయ్యాయి<<>>. పంట వివిధ దశల్లో ఉంది. పిలక దశలో ఉన్న పైర్లలో ఎకరానికి 35KGల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉంటే 35KGల యూరియాతోపాటు 15KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. పిలకలు వేసే దశలో పొలంలో కనీసం 2CM వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. కాగా ఈ నెలలో వరినాట్లు వేయరాదు. వేస్తే పూత దశలో చలి వల్ల గింజ పట్టక దిగుబడిపై ప్రభావం చూపుతుంది.

News September 14, 2025

HZB: సైబర్ నేరగాళ్లను తెలివిగా బోల్తా కొట్టించిన తల్లి

image

సైబర్ నేరగాళ్ల నుంచి KNR(D) HZB‌కు చెందిన సుస్రత్ అనే మహిళ తెలివిగా తప్పించుకుంది. ఆమె కూతురు పోలీసుల కస్టడీలో ఉందని సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. కేసు పరిష్కారం కోసం వెంటనే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట్లో భయపడినప్పటికీ, ఆమె వెంటనే తేరుకుని తన కూతురు చదువుతున్న కాలేజీకి వెళ్లింది. అక్కడ ఆమె కూతురు క్షేమంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.