News February 17, 2025

సంగారెడ్డి: 2008 DSCకి ఎన్నికైన మాజీ ఉప సర్పంచ్

image

2008 డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 184 మంది నియామకం అయ్యారు. కాగా నాగల్‌గిద్ద మండలం కారముంగి మాజీ ఉప సర్పంచ్ గుండెరావు పాటిల్ తాజాగా టీచర్ అయ్యారు. తమకు 2008 డీఎస్సీ ఫలితాలు వివిధ కారణాలతో ఆగిపోవడంతో వ్యవసాయం చేసుకుంటూ గ్రామానికి ఉపసర్పంచిగా సేవలందించానని పాటిల్ తెలిపారు. 17ఏళ్ల నిరీక్షణ అనంతరం ఫలితాలు అనుకూలంగా రావడంతో సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 1, 2025

పోక్సో కేసులో దోషికి శిక్ష రద్దు

image

పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తిపై శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కృపాకరన్(TN) అనే వ్యక్తి 2017లో బాలికపై లైంగికదాడి చేశాడు. అతడికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను మద్రాస్ HC సమర్థించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించిన అతడు తాము పెళ్లి చేసుకుని బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. అది ప్రేమతో జరిగిన నేరమే తప్ప కామంతో కాదని వ్యాఖ్యానిస్తూ సుప్రీం అతడి శిక్షను రద్దు చేసింది.

News November 1, 2025

GWL: ధర్మవరం బీసీ హాస్టల్ ఘటనపై విచారణ: డిప్యూటీ డైరెక్టర్

image

ఇటిక్యాల మండలం ధర్మారంలోని బీసీ బాలుర వసతి గృహంలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. చికిత్స పొందుతున్న విద్యార్థులను బీసీ సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ అలోక్ పరామర్శించారు. రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఆయన విద్యార్థులతో మాట్లాడి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

News November 1, 2025

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి బీఆర్‌ఎస్‌ పిలుపు

image

భద్రాద్రి జిల్లాలో రోడ్ల దయనీయ స్థితి, డిఎంఎఫ్‌టి నిధుల దుర్వినియోగంపై నిరసనగా నవంబర్ 7న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టి ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు.