News August 20, 2025

సంగారెడ్డి: 21వరకు గడువు పొడిగింపు

image

జిల్లాలోని ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 21 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు మండలాలలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

Similar News

News August 20, 2025

నేడు మంగళగిరికి రానున్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటన ఖరారైంది. ఉదయం 10:40 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 6:30 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News August 20, 2025

తీవ్ర నేరం చేస్తే సీఎం/పీఎం పదవి నుంచి ఔట్!

image

ఐదేళ్లు, అంతకుమించి శిక్ష పడే అవకాశమున్న క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును NDA ప్రభుత్వం నేడు <<17458012>>లోక్‌సభలో<<>> ప్రవేశపెట్టనుంది. PMతో సహా మంత్రులు, రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయనుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన అమల్లోకి వస్తే పదవిని కోల్పోతారు. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.

News August 20, 2025

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో.. RMPనే పెద్ద వైద్యుడు!

image

రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో వైద్య సేవలు నామమాత్రంగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా భక్తులు వస్తున్నా, వారికి వైద్యం అందించేందుకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. కేవలం ఓ ఆర్‌ఎంపీ మాత్రమే సేవలు అందిస్తుండగా, ఉన్న ఒక్క అంబులెన్సులోనూ సౌకర్యాలు లేవు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున తక్షణం శాశ్వత వైద్యులను నియమించాలని కోరుతున్నారు.