News December 20, 2025
సంగారెడ్డి: ’21వ తేదీన జాతీయ లోక్ అదాలత్’

సుప్రీంకోర్ట్ ఉత్తర్వుల మేరకు ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర శుక్రవారం తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ కోర్టులలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజలు, కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 21, 2025
ANU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 2వ ఏడాది రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి నిర్వహిస్తామని..ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29లోపు, రూ.100 ఫైన్‌తో 30లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.
News December 21, 2025
KNR: ఆదిలోనే అడ్డంకి.. నిరాశ కలిగిస్తున్న ఫెర్టిలైజర్ యాప్

రైతులకు ఎరువుల లభ్యత, నిల్వలు, ధరల వివరాలను వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘Fertilizer’ మొబైల్ అప్లికేషన్ ప్రారంభంలోనే మొరాయించింది. యాప్ ఓపెన్ చేయగానే “ఈ యాప్ తాత్కాలికంగా నిలిపివేయబడింది” అనే సందేశం కనిపిస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలు కాగితాల మీద పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడేలా ఉండాలని ఉమ్మడి KNR రైతులు కోరుకుంటున్నారు.
News December 21, 2025
కొండగట్టు: ‘పవనసుతుడిపై పవన్ ప్రేమ’

‘తన తల్లి జన్మనిస్తే కొండగట్టు అంజన్న పునర్జన్మనిచ్చారు’ అంటూ AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నపై ఎనలేని ప్రేమచూపిస్తారు. ఏపీ ఎన్నికల్లో తన ‘వారాహి’ వాహనానికి ప్రత్యేకపూజలు నిర్వహించి ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. అంజన్నను పలుమార్లు దర్శించుకున్న ఆయన.. భక్తులు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకొని వారి సౌకర్యార్థం సత్ర నిర్మాణానికి సహకరించి అంజన్నపై తన ప్రేమను చాటుకున్నారు.


