News September 20, 2025

సంగారెడ్డి: 21 నుంచి దసరా సెలవులు: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 21 నుంచి OCT 3 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించిందని డీఈఓ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. దసరా సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News September 20, 2025

ఐటీ కంపెనీలపై ఎఫెక్ట్ ఇలా..!

image

భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL లాంటి సంస్థలు USలో పని చేస్తూ భారతీయులను రిక్రూట్ చేసుకుంటాయి. H1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపుతో వాటిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఫలితంగా ఆ సంస్థలు ఇండియా లేదా ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో భారతీయులు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు.

News September 20, 2025

HYD: ట్రేడింగ్ ఫ్రాడ్‌లో సంజీవ్ కుమార్ అరెస్ట్

image

ట్రేడింగ్ మోసానికి పాల్పడిన పంజాబ్‌కు చెందిన సంజీవ్ కుమార్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవ్ సోషల్ మీడియా ద్వారా 69 ఏళ్ల పూజారిని నమ్మించి నకిలీ ట్రేడింగ్ యాప్‌లో లాభాలు వస్తున్నట్లు చూపించి రూ. 1.23 కోట్లు మోసగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్, కంపెనీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

News September 20, 2025

రాయచోటిలో వర్ష బీభత్సం.. ముగ్గురి మృతి

image

రాయచోటిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న తల్లీ, బిడ్డ షేక్ మున్నీ(27), ఇలియాస్ (6)ను కాపాడబోయి మరో వ్యక్తి వంగల గణేశ్ (30) మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.