News January 20, 2026
సంగారెడ్డి: 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. పరీక్షలకు గైర్హాజర్ అయితే ఫెయిల్ అయినట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.. APCRDAతో పూర్తైన ఒప్పందం

అమరావతిలో 55 ఎకరాలలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్(IIULER) ఏర్పాటు చేసేందుకు APCRDAతో శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి అశోక్ పాండేకు CRDA ఎస్టేట్స్ విభాగ అధికారి జుబిన్ రాయ్ సంబంధిత పత్రాలు అందజేశారు. క్యాంపస్ ఏర్పాటుకై తోలి దశలో రూ.300 కోట్ల పెట్టుబడి పెడతామని, న్యాయవిద్యకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని IIULER వర్గాలు తెలిపాయి.
News March 7, 2026
జగిత్యాల: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి’

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలుపై కరీంనగర్ కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
News March 7, 2026
నటుడు మురళీధర్ భార్య కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ భార్య శశికళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మురళీధర్ రిటైర్మెంట్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. రంగ స్థలం, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, బలగం, మ్యాడ్, మేం ఫేమస్ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు.


