News August 17, 2025
సంగారెడ్డి: 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతాయని డీఈవో వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. 22, 23 తేదీల్లో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు 50% చొప్పున హాజరుకావాలని పేర్కొన్నారు. 29న ఉన్నత పాఠశాలలో పనిచేసే లాంగ్వేజ్, 30న నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
Similar News
News August 18, 2025
ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్నారా: అంబటి

AP: సినీ హీరో ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తీవ్ర <<17432318>>వ్యాఖ్యలు<<>> చేశారంటూ ఆడియో వైరలవ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త TDP అధిష్ఠానం దృష్టికి చేరడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘చిన్న ఎన్టీఆర్‌ను చూసి పెద బాబు, చిన బాబు భయపడుతున్నారా?’ అని చంద్రబాబు, లోకేశ్‌ను ట్యాగ్ చేశారు. అటు MLA వివరణ ఇచ్చుకున్నా NTR అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
News August 18, 2025
రాయికల్ : గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

రాయికల్ (M) అయోధ్య గ్రామానికి చెందిన ఎడమల సాయిరెడ్డి (21) ఆదివారం ఉదయం గడ్డి మందు తాగగా, రాత్రి జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి రెడ్డి హైదరాబాదులో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఆదివారం ఉదయం స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
News August 18, 2025
కొత్తపేట: ఆస్పత్రిలో కుమారుడు.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

కొత్తపేట మండలం పూజారి పాలానికి చెందిన పొనుగుపాటి రమేష్ (31) బైక్‌పై వస్తుండగా ఆదివారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు. కరప మండలం వలసపాకల గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. మృతుని తమ్ముడు నటరాజు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రమేష్ చిన్న కొడుకు వివేక్ వర్దన్‌కు కాకినాడ GGHలో సర్జరీ చేయించారు. ఆస్పత్రి నుంచి రమేష్ ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.