News February 21, 2026
సంగారెడ్డి: 23 నుంచి యథావిధిగా ప్రజావాణి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
Similar News
News February 21, 2026
తిరుమల శ్రీవారితో వైసీపీ రాజకీయం చేస్తుంది: మంత్రి సుభాశ్

తిరుమల శ్రీవారిని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆరోపించారు. శనివారం మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు పదేపదే దెబ్బతీస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలని ఆయన వ్యాఖ్యనించారు.
News February 21, 2026
వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు.
News February 21, 2026
WGL: ఇసుక దందా అడ్డుకట్టకు చెక్ పోస్టులు..!

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు మళ్లీ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి సక్రమంగానే ఇసుక రవాణాకు సహకరించిన పోలీసులు అకస్మాత్తుగా చెక్ పోస్టులు పెట్టడంపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఐనవోలు మండలం నందనంలో జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్‌పై దాడి, ఓ ప్రజాప్రతినిధి మామూళ్ల వసూళ్లపై సీరియస్‌గా చర్చ జరగడంతో ఈ అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలుస్తోంది.


