News February 26, 2025
సంగారెడ్డి: 27న ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించాలని వినతి

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో పరమేశం బుధవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పోచారం రాములు మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇవ్వకుంటే ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేరని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వెంకట నర్సింహారెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News February 26, 2025
రేపు స్కూళ్లకు సెలవు

APలో MLC ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉండనుంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం టీచర్స్ MLC ఎన్నిక నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని DEOలు ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మీకు రేపు సెలవు ఇచ్చారా? తెలంగాణలోనూ <<15581975>>సెలవు <<>>ఇచ్చారు.
News February 26, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. మొత్తం జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల వద్దకు ఎన్నికల సామగ్రి తరలిస్తున్నట్లు వెల్లడించారు.మొత్తం 6వేల 607 మంది ఓటర్లు ఉన్నారు.
News February 26, 2025
NZB: చికిత్స పొందుతూ మహిళ మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.