News December 28, 2025
సంగారెడ్డి: 29, 31 తేదీల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 29, 31 తేదీల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. యూపీఎస్, హైస్కూళ్లలో పని చేసే సబ్జెక్టు ఉపాధ్యాయులకు కేటాయించిన పాఠశాలల్లో సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు. ఈ సమావేశాలకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 30, 2025
గద్వాల: ఆహార విక్రయశాలలపై నిఘా ఉంచాలి: కలెక్టర్

గద్వాల జిల్లాలోని హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన ఆహార భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యమని పేర్కొన్నారు. జిల్లాలో 1,278 విక్రయశాలలు నమోదయ్యాయని, మిగిలిన వాటిని కూడా తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ చేయించాలని అధికారులకు సూచించారు.
News December 30, 2025
గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్లకు భారీ డిమాండ్

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్లు ధరలు సాధారణ రకం రూ. 200 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కుటుంబాలు, యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది.
News December 30, 2025
సిరిసిల్ల: ‘టీ-పోల్’ నుంచే ఓటర్ల జాబితాలు డౌన్‌లోడ్

రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘టీ-పోల్’ నుంచే ఓటర్ల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన, డౌన్‌లోడ్ తదితర సాంకేతిక అంశాలపై ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశం చేశారు.


