News September 14, 2025
సంగారెడ్డి: ’30లోగా నమోదు చేసుకోవాలి’

జిల్లాలోని వ్యవసాయ రైతులు తమ పంటల వివరాలను 30వ తేదీలోగా ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆన్లైన్‌లో నమోదు చేసుకుంటేనే సీసీఐలో అమ్మడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని అన్నారు. కావున రైతులందరూ తమ పట్టా పాసు బుక్‌ను తీసుకొని ఆయా మండలాల వ్యవసాయ అధికారులను కలవాలని కోరారు.
Similar News
News September 14, 2025
తురకాపాలెం వరుస మరణాలకు కారణం యురేనియం?

తురకాపాలెంలో మరణమృదంగం కలకలం రేపింది. ఐతే మరణాలకు గల కారణాలు ఆ ప్రాంతంలోని యురేనియం అవశేషాలే అన్నట్లుగా చెన్నై ప్రయోగశాల నిర్ధారణ చేసినట్లుగా తెలిసింది. ఇటీవల నమూనాలను సేకరించి చెన్నై ల్యాబ్‌కు పంపగా ఈ విషయం వెల్లడైంది. ఆ ప్రాతంలో క్వారీలు ఉండటంతో అక్కడ నీటిని పలు సమయాల్లో వాడటంతోనే సమస్య ఏర్పడిందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గతంలో అధికారులు తెలిపిన వాటికి చెన్నై రిపోర్టు భిన్నంగా ఉంది.
News September 14, 2025
MDK: పుట్టినరోజు చేశారు.. హతమార్చారు

శివంపేట(M) శభాష్‌పల్లిలో చిన్నారి <<17694310>>తనుశ్రీ(2) హత్య<<>> కేసులో తల్లి మమత, ప్రియుడు ఫయాజ్‌ను ఏపీలో అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ తెలిపారు. హత్యకు వారం ముందు తనుశ్రీ పుట్టినరోజు ఘనంగా జరిపినట్లు వివరించారు. హత్య అనంతరం వరుస బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. ఫయాజ్‌పై ఇప్పటికే 19 కేసులు ఉన్నాయన్నారు. వివాహేత సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి కన్న కూతుర్ని తల్లి హతమార్చిన విషయం తెలిసిందే.
News September 14, 2025
మద్నూర్: నీటి తొట్టెలో పడి బాలుడి మృతి

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో టీ పాయింట్ నడిపే కుమ్మరి రాజు రెండున్నరేళ్ల చిన్నకుమారుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.