News March 6, 2025

సంగారెడ్డి: 31లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో LRS క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

పోక్సో బాధితుల పట్ల వివక్షపై సూచనలు చేయాలి: జిల్లా న్యాయమూర్తి

image

మహబూబాబాద్‌లో గురువారం జరిగిన సమన్వయ సమావేశంలో జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ పలు సూచనలు చేశారు. బాల్య వివాహాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. “బాల్ వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమంలో సమాచారం గోప్యంగా ఉంచి వివాహాలు ఆపి, బాలికల చదువుకు సహాయం చేయాలన్నారు. POCSO బాధితులకు పాఠశాలల్లో వివక్ష రక్షణ, అనధికృత వాహన ప్రమాదాలకు న్యాయ సేవ సహాయం తీసుకోవాలన్నారు.

News January 8, 2026

SPMVV: ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు

image

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో విద్యార్థినిల కోసం జర్మన్ బాషా, ఉన్నత విద్య అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి జర్మన్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలియజేశారు. VC ఉమ మాట్లాడుతూ.. విద్యార్థినిల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో గ్లోబల్ అవకాశాలపై మార్గదర్శకత్వం చేశారు.

News January 8, 2026

తిరుపతి: పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆంధ్రప్రదేశ్ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) క్రాప్స్ మెన్ ట్రైనింగ్ స్కీం(CTS)-2026 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ పేర్కొన్నారు. 21 సంవత్సరాలు వయసు కలిగి ఉండి, 3 సంవత్సరాలు పని అనుభవం, అప్రెంటిస్ పూర్తి చేసి, SCVT పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 28వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.