News August 29, 2025
సంగారెడ్డి: 3,740 ఎకరాల పంట నష్టం

మూడు రోజులగా కురిసిన భారీ వర్షాల వల్ల సంగారెడ్డి జిల్లాలో 3,740 ఎకరాల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పంట నష్టం ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు.
Similar News
News August 29, 2025
NGKL: సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా: కలెక్టర్

జిల్లాలో ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 460 GPలకు, 4,102 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి ప్రచురించామని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి, అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు.
News August 29, 2025
సిద్దిపేట: ‘రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి’

జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు మునిగి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ హైమావతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వర్షాలతో ఇళ్లు కూలిపోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగిపోయిన వాటిని మరమ్మతులు చేయాలని కోరారు.
News August 29, 2025
మహిళల క్రికెట్ కోసం గూగుల్‌తో ICC ఒప్పందం

ఉమెన్ క్రికెట్‌ను గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు గూగుల్ సంస్థతో ICC ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉమెన్ క్రికెట్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఈవెంట్లను ప్రమోట్ చేయడంలో ఈ పార్ట్‌నర్‌షిప్ కీలకంగా వ్యవహరించనుంది. ఆండ్రాయిడ్, గూగుల్ జెమిని, గూగుల్ పిక్సెల్, గూగుల్ పే వంటి సర్వీసెస్ ద్వారా ఉమెన్ క్రికెట్‌ను ప్రమోట్ చేయనున్నారు.