News September 2, 2025

సంగారెడ్డి: 4 వరకు మళ్లీ ఉపాధ్యాయుల సర్దుబాటు

image

జిల్లాలో ఉపాధ్యాయ సర్దుబాటు మళ్లీ నిర్వహించాలని పాఠశాల డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 4వ తేదీ వరకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఎంఈఓలకు ఆదేశించారు. ఎంఈఓ నుంచే నివేదికలు రాగానే ఖాళీ స్థానాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 2, 2025

HYD: YSRకు మంత్రి సీతక్క నివాళులు

image

మాజీ సీఎం దివంగత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్‌లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని అన్నారు.

News September 2, 2025

మెదక్: డీవైఎస్ఓ దామోదర్ రెడ్డి బదిలీ.. డీఈఓకే బాధ్యత

image

మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్‌ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.

News September 2, 2025

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,320 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.6,610, పచ్చి పల్లికాయకు రూ.4,480 ధర వచ్చింది. కాడి పసుపు రూ.10,889, పసుపు గోల రూ.10,629, 5531 రకం మిర్చి రూ.13,500 ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.