News April 3, 2025
సంగారెడ్డి: 56 ఇళ్లకు ఇందిరమ్మ నిధులు విడుదల

జిల్లాలో బేస్ మీట్ వరకు పూర్తి చేసిన 56 ఇళ్లకు లక్ష చొప్పున రూపాయల నిధులు వారి ఖాతాలో జమ చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లో 1200 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు కూడా బేస్ మీట్ వరకు నిర్మిస్తే లక్ష చొప్పున నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
రాష్ట్ర పండుగగా సరే.. నిధులు మాటేమిటీ?: నేలపూడి

జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించినా, నిధులు కేటాయించకపోవడంపై YCP రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు నేలపూడి స్టాలిన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో నంబర్-2లో ఆర్థిక అంశాల ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ తీర్థానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని, లేనిపక్షంలో అది కోనసీమ సంస్కృతిని అవమానించడమేనని పేర్కొన్నారు.
News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News January 9, 2026
నెల్లూరు జిల్లాలో రూ.6675 కోట్లతో పవర్ ప్లాంట్

నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు IFFCO kisan SEZలో టాటా సంస్థ 6,675 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమను కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా పురోగతి లేని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమల రాకతో యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


