News November 1, 2025
సంగారెడ్డి: 6, 7 తేదీల్లో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలు

జిల్లా స్థాయిలో నిర్వహించిన కళా ఉత్సవ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 6, 7 తేదీలలో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ పోటీలు హైదరాబాద్‌లోని టీఎస్ఐఆర్డీ రాజేంద్ర నగర్లో జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News November 1, 2025
విజయవాడ: NTRకి.. అచ్చొచ్చిన గది ఇదే.!

విజయవాడలోని దుర్గాకళామందిర్‌లోని ఓ గది అంటే నందమూరి తారక రామారావుకి ఎంతో సెంటిమెంట్. 1934లో ఆయన ఇక్కడే నాటకాలు వేసేవారు. ఆయన నటించిన మొత్తం 175సినిమాలు ఇక్కడే ప్రదర్శితమయ్యాయి. ఈ గది కలిసిరావడంతో, NTR విజయవాడ వచ్చినా, షూటింగ్‌లు జరిగినా హోటళ్లలో దిగకుండా ఇక్కడుండేవారు. TDP కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే నడిచేవి. ఆయన ఉదయం వ్యాయామం చేసి, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ,సాంబార్ తెప్పించుకునేవారు.
News November 1, 2025
HNK: ఓటర్ జాబితా రివిజన్‌ను వేగంగా పూర్తి చేయాలి!

రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. 2002, 2025 ఓటరు జాబితాలను మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించామని తెలిపారు. ఇప్పటివరకు 63 లక్షల ఓటర్ల నిర్ధారణ పూర్తయిందని, మిగిలినవీ త్వరగా ముగించాలని ఆదేశించారు.
News November 1, 2025
ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలి: షర్మిల

AP: మొంథా తుఫాను రైతుల పాలిట మహావిపత్తు అని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల అన్నారు. తుఫాన్ ప్రభావంతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లితే సీఎం చంద్రబాబు తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇవ్వలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి, ఉచిత పంట బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలన్నారు.


