News October 6, 2025
సంగారెడ్డి: 7న ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ పోటీలు 7వ తేదీన సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. బాల,బాలికల అండర్-14, 17 పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99481 03605 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
Similar News
News October 6, 2025
పీహెచ్‌సీ వైద్యుల చర్చలు విఫలం.. రిలే దీక్షలు కొనసాగింపు

పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్లపై ఆదివారం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. డిమాండ్లకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అంగీకరించకపోవడంతో వైద్యులు రిలే దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్‌తో జరిగిన చర్చల్లో, పీజీ ఇన్ సర్వీస్ 20% కోటాను ఏడాది పాటు కొనసాగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే, వైద్యులు ఆ కోటాను ఐదేళ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News October 6, 2025
నిర్మల్: బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి

నిర్మల్ జిల్లాలో జరిగిన బతుకమ్మ వేడుకలు విషాదాన్ని నింపాయి. బతుకమ్మ కోసం వినియోగించిన డీజే కారణంగా బంగల్ పేట్‌కు చెందిన భాగ్యలక్ష్మి (56) గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి డీజే శబ్దాల మధ్య బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స నిర్వహిస్తుండగానే మృతి చెందారు. డీజే సౌండ్ కారణంగా గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.
News October 6, 2025
ద్వారకాతిరుమల: నేడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం

ద్వారకాతిరుమల శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి చిన్న వెంకన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అనివేటి మండపంలో కళ్యాణ మండపాన్ని ముస్తాబు చేశారు. మండప పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. పూల అలంకరణ సోమవారం సాయంత్రానికి పూర్తవుతుందని ఆలయ ఈవో ఎన్.వి. సత్యనారాయణమూర్తి తెలిపారు. శ్రీహరి కళాతోరణం వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.