News September 27, 2024

సంగారెడ్డి: DSC-2008 సర్టిఫికెట్ వెరిఫికేషన్.. రేపు చివరి రోజు

image

2008 DSCకి ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కొనసాగగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తీరును అధికారులను అడిగి తెలుసుకున్న డిఇఓ మాట్లాడుతూ.. వెరిఫికేషన్ ప్రక్రియకు రేపు చివరి రోజు అన్నారు. అధికారులు రవీందర్ రెడ్డి, సాయిలు, వహిద్ పాషా, లక్ష్మీనారాయణ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు.

Similar News

News January 27, 2026

మెదక్ జిల్లాలో 51 మాంసాహార జంతువులు..!

image

మెదక్ జిల్లాలో వన్య ప్రాణుల లెక్క తేలింది. జిల్లాలోని 6 రేంజ్‌ల పరిధిలో 51 మాంసాహార జంతువులు గుర్తించినట్లు డీఎఫ్ఓ జోజి పేర్కొన్నారు. రేంజ్‌ల వారీగా మాంసాహార జంతువులు మెదక్-16, రామాయంపేట-9, తుప్రాన్-5, నర్సాపూర్-6, కౌడిపల్లి-12, పెద్దశంకరంపేట-3 ఉన్నట్లు తెలిపారు. సర్వేలో 71 మంది అటవీ సిబ్బంది, 143 మంది వాలంటీర్లు పాల్గొన్నారని చెప్పారు.

News January 26, 2026

మెదక్: ‘న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్ధకత’

image

ప్రతి బాధితుడికి న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్థకత అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి బాధ్యతాయుత పౌరులుగా జీవించాలన్నారు. మెదక్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. మాతృభూమి కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగప్రాయంగా అర్పించిన ఫలితంగా మనకు భారత రాజ్యాంగం లభించిందని తెలిపారు.

News January 26, 2026

చేగుంట: వన్యప్రాణుల లెక్క తేలింది

image

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ బీట్ పరిధి చిట్టోజి పల్లి అటవీ ప్రాంతంలో అఖిలభారత అటవీ జంతువుల గణన పూర్తయినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ తెలిపారు. పులులు, జింకలు, అడవి పందులు, నక్కలు, హైనా, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, నెమళ్లు, అడవి కోళ్ళు, పావురాలు, గద్దలు, గుడ్లగూబలు, సర్పాలు, పాములు, ఉభయచర ఉనికి, సంఖ్య, సంచార మార్గాలను నమోదు చేసినట్లు తెలిపారు.