News July 5, 2025

సంగారెడ్డి: IIITకి 345 మంది ఎంపిక

image

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.

Similar News

News July 5, 2025

సర్పంచి ఎన్నికలు అప్పుడేనా?

image

TG: BC రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఆయనతో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్లపై చర్చించారు. కులగణనపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. BCలకు 42% సీట్లు ఇచ్చి, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం.

News July 5, 2025

కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి జైలు శిక్ష: సీఐ చిట్టిబాబు

image

ఆర్టీసీ కండక్టర్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో తోట్లవల్లూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ సుదీర్‌పై వీరభద్రరావు, ప్రదీప్ కుమార్ దాడి చేశారు. ఈ ఘటనలో కోర్టు వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది.

News July 5, 2025

సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ADB ఎస్పీ

image

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్‌లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు.