News December 26, 2025
సంగారెడ్డి: JAN 10 నుంచి సెలవులు.. DEO హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెలవు దినాల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 27, 2025
నేడు CWC కీలక భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు. ఈ భేటీలో ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై ముఖ్యంగా చర్చించే అవకాశముంది. అలాగే త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ స్ట్రాటజీ ఖరారు చేయనున్నట్లు సమాచారం.
News December 27, 2025
పెద్ద దానం చేస్తే ఎక్కువ ఫలం ఉంటుందా?

దానం ఎంత పెద్దది అనే దాని కంటే, ఎంత తృప్తిగా చేశామన్నదే ముఖ్యం. భక్తితో చేసే చిన్న సాయమైనా ఎంతో పుణ్యాన్నిస్తుంది. శక్తికి మించి దానం చేయాల్సిన అవసరం లేదు. స్తోమతను బట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి తోడ్పడటం ఎంతో గొప్పది. స్వార్థం లేని త్యాగం, దయాగుణంతో ఇచ్చే పిడికెడు ధాన్యమైనా.. అది దైవదృష్టిలో గొప్ప దానంగా పరిగణిస్తారు. ప్రేమతో చేసే చిన్న సాయం జీవితంలో వెలుగు నింపుతుంది.
News December 27, 2025
జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

AP: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో 4-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోనూ చలి పెరిగింది. ఉత్తర భారతం నుంచి గాలులు, హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు వల్ల శీతల తరంగాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో చలి పెరిగిందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం మరింత పెరిగే ఆస్కారముందని అంచనా వేస్తున్నారు.


