News March 6, 2025

సంగారెడ్డి: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

Similar News

News March 6, 2025

వికారాబాద్: ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6, 963 మంది విద్యార్థులు

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మొదటి పరీక్షకు 6,963 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం లాంగ్వేజెస్ తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News March 6, 2025

నారా భువనేశ్వరికి స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని దంప‌తులు

image

విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేప‌ట్ట‌డం సంతోషంగా ఉంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జ‌రిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భ‌వ‌న్ నిర్మాణ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఎంపీ కేశినేని దంప‌తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసేందుకు విచ్చేసిన నారా భువనేశ్వరికి కేశినేని దంపతులు ఘన స్వాగతం పలికారు. 

News March 6, 2025

జైశంకర్‌పై ఖలిస్థానీల దాడి యత్నంపై మండిపడ్డ భారత్

image

EAM జైశంకర్ UK పర్యటనలో భద్రతా <<15666524>>లోపంపై<<>> భారత్ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీలవి రెచ్చగొట్టే చర్యలని మండిపడింది. ‘జైశంకర్ పర్యటనలో భద్రతా లోపాన్ని ఫుటేజీలో మేం పరిశీలించాం. వేర్పాటువాదులు, అతివాదుల రెచ్చగొట్టే చర్యల్ని ఖండిస్తున్నాం. వారు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం విచారకరం. ఇలాంటి ఘటనలపై ఆతిథ్య ప్రభుత్వం మేం కోరుకుంటున్నట్టు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.

error: Content is protected !!