News November 15, 2025
సంగారెడ్డి: ‘NMMS హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి’

ఎన్ఎంఎంఎస్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. www.bse.telangana.comలో యూసర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఈనెల 23న ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు.
Similar News
News November 15, 2025
వీధుల పాలైన బాల్యం.. కూటి కోసం భుజాలపై చెత్త భారం.!

పుస్తకాల సంచితో బడికి వెళ్లాల్సిన బాల్యం నేడు వీధుల పాలైంది. గుంటూరు నగర వీధుల్లో శనివారం కనిపించిన దృశ్యం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా, పసి వయసులోనే కొందరు చిన్నారులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. బాలల హక్కుల గురించి ఎన్ని చట్టాలు ఉన్నా, పట్టపగలే నగరంలో ఇలాంటి బాలకార్మిక దృశ్యాలు కనిపించడం ఆవేదన కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
News November 15, 2025
సోమశిల జలాశయం నుంచి నీటి విడుదల

పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మ. 2 గంటలకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు. చేపల వేటకు, ఈతకు ఎవరిని వెళ్లకుండా జాగ్రతగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
News November 15, 2025
ADB: 25వ ఏటే అమరుడయ్యాడు!

ఆదివాసీ సమరయోధుడిగా చరిత్రకెక్కెని గొప్ప వీరుడు బిర్సా ముండా. ఆయన 1876నవంబర్ 15న ఝార్ఖండ్ ఉళిహటులో జన్మించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారు. బిర్సా 1899 డిసెంబర్లో ఉల్గులన్ (విప్లవం) ప్రారంభించారు. ఎన్నో పోరాటాల అనంతరం తొలిసారి 1898లో బ్రిటిషర్లను ఓడించారు. 1900 ఫిబ్రవరి 3న ఆయన్ను అరెస్ట్ చేసి రాంచీ జైల్లో పెట్టారు. 1900జూన్ 9న తన 25వ ఏట జైల్లోనే అమరుడయ్యారు.


