News December 3, 2025

‘సంచార్ సాథీ’పై వెనక్కి తగ్గిన కేంద్రం

image

సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైళ్లలో ప్రీ <<18439451>>ఇన్‌స్టాలేషన్<<>> తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సాథీ యాప్‌ను అన్ని కొత్త మొబైళ్లలో ప్రీ ఇన్‌స్టాలేషన్ చేస్తామన్న కేంద్రం ప్రకటనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్ తెస్తోందని, ఇది ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో యాప్ ప్రీ ఇన్‌స్టాలేషన్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది.

Similar News

News December 4, 2025

27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం

image

HYDలో భూమి బంగారమైందంటే ఇదేనేమో. కోకాపేట నియోపొలిస్‌లో ప్రభుత్వం 27 ఎకరాలు విక్రయిస్తే ఏకంగా రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ మూడో విడత వేలంలో ప్లాట్ నంబర్ 19లో ఎకరం రూ.131 కోట్లు, 20లో ఎకరం రూ.118 కోట్లు పలికింది. మొత్తం 8.04 ఎకరాలను వేలం వేయగా HMDAకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రెండు వేలం పాటల్లో రూ.2,700 కోట్లు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికింది.

News December 4, 2025

భారత్ ఓటమికి కారణమిదే..

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ <<18462441>>ఓటమికి<<>> చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే కారణం. మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడు సెంచరీతో చెలరేగాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లకు 82, కుల్దీప్ 10 ఓవర్లకు 78, హర్షిత్ 10 ఓవర్లకు 70 రన్స్ సమర్పించుకోవడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. ఇక ఇలాంటి ఫీల్డింగ్‌తో 400 కొట్టినా కాపాడుకోలేమని క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News December 4, 2025

సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్‌లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.