News April 20, 2024
సంజామలకు పిడుగుల హెచ్చరిక: APSDMA

సంజామల మండల వ్యాప్తంగా మరి కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని APSDMA స్పష్టం చేసింది.
Similar News
News September 30, 2025
దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ప్రతిష్ఠ బందోబస్తు: ఎస్పీ

దసరా పండుగను పురస్కరించుకుని వచ్చే నెల 2న (గురువారం) దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం శాంతియుతంగా, ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా జరగాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. బన్నీ ఉత్సవం సందర్భంగా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
News September 30, 2025
కల్లూరు: కారు ఢీకొని 33 గొర్రెలు, కాపరి మృతి

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన కురువ ఎల్ల రాముడు (33) కారు ఢీకొని మృతి చెందాడు. ఉలిందకొండ నేషనల్ హైవేలో గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా కర్నూల్ నుంచి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. 33 గొర్రెలతో సహా కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
News September 30, 2025
జోగుళాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఏపీ తరఫున జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జోగుళాంబా సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, కలెక్టర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.