News December 29, 2025
‘సంజీవని నిధి’కి విరాళాలు ఇవ్వండి.. విశాఖ కలెక్టర్ విజ్ఞప్తి

విశాఖ జిల్లాలోని పేదలకు, బాధితులకు అండగా నిలిచేందుకు ‘సంజీవని నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పూలు, కేకులు, బహుమతులకు బదులుగా మానవత్వంతో ఈ నిధికి సాయం చేయాలని కోరారు. ఆసక్తి గల దాతలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతా (50100500766040, IFSC: HDFC0009179) ద్వారా విరాళాలు అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News December 31, 2025
ఎంవీపీ కాలనీ: గంజాయి, డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

ఎంవీపీ కాలనీ లాస్యన్స్ బే జంక్షన్‌లో స్కూటీ మీద ముగ్గురు వ్యక్తులు గంజాయి డ్రగ్స్ తీసుకువెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోడవరం, అనకాపల్లి, ఇసుకతోట ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు యువకులు స్కూటీపై ఐదు కేజీలు గంజాయి, 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
News December 31, 2025
పార్లమెంట్ అటెండెన్స్.. విశాఖ ఎంపీకి 96%

విశాఖ MP శ్రీభరత్ ఈ ఏడాది పార్లమెంట్ అటెండెన్స్‌లో 96 శాతం సాధించారు. ఇండియన్ పోర్ట్స్ బిల్-225, దేశంలో అంధత్వ సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార భద్రతా నిబంధనల బలోపేతం, విశాఖ ఓడరేవులో బొగ్గు&ఇనుప ఖనిజ రవాణా వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం వంటి 15 డిబేట్స్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా మొత్తం 113 ప్రశ్నలను సంధించారు.
News December 31, 2025
విశాఖలో మూడు స్టాండింగ్ కమిటీల పర్యటన

విశాఖలో రైల్వే, వాణిజ్య, రక్షణ శాఖలకు చెందిన 3 పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు జనవరిలో పర్యటించనున్నాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కమిటీల పర్యటనకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


