News August 17, 2025
సంతకవిటి: నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు

బహిర్భూమికి వెళ్లి నాగవళి నదిలో ప్రమాదవశాత్తూ జారిపడి వృద్ధుడు గల్లంతైన ఘటన ఆదివారం సంతకవిటి మండలంలో జరిగింది. మండలంలోని పొడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య (76) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది తీరానికి వెళ్లాడు. ఎప్పటికీ రాకపోవడంతో వృద్ధుడి కోసం కుటుంబీకులు వెతికానా దొరకలేదు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు.
Similar News
News August 18, 2025
ఈ ఏడాదిలో రూ.25.21 లక్షల సీజ్: VZM SP

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరుకు పేకాట, కోడి పందెలుపై జరిపిన దాడుల్లో మొత్తం రూ.25,21,077 సీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై 141 కేసులు నమోదు చేసి 1031 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కోడిపందాలు ఆడుతున్న వారిపై 35 కేసులు నమోదు చేసి 174 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 75 పందెం కోళ్లు, నాలుగు పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
News August 17, 2025
‘విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు రేపు సెలవు’

విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.
News August 17, 2025
జర్నలిస్ట్‌లకు త్వరలో క్యూఆర్ కోడ్‌తో పాస్‌లు: SP

విజయనగరం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ప్రత్యేక పాస్‌లు మంజూరు చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ ప్రకటించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ఆదివారం హాజరయ్యారు. జర్నలిస్ట్‌లకు క్యూఆర్ కోడ్‌తో కూడిన వెహికల్ పాస్‌లు మంజూరు చేసి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తామన్నారు. పోలీసులకు జర్నలిస్టుల సహకారం గొప్పదని పేర్కొన్నారు.