News November 24, 2024
సంతనూతలపాడు ZPHSలో కలెక్టర్ తనిఖీలు
సంతనూతలపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లల్లో అభ్యాస శక్తిని పెంపొందించాలని సూచించారు.
Similar News
News November 24, 2024
ఒంగోలులో సంబరాలు జరుపుకున్న BJP నేతలు
మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా ఒంగోలులో BJP నాయకులు శనివారం రాత్రి బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ముందుగా ఒంగోలులో ర్యాలీ నిర్వహించిన నాయకులు మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చర్చి కూడలి వద్ద బాణసంచాలో కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News November 23, 2024
పెద్దారవీడు మండలంలో వివాదాస్పద ఘటన
పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పశువులను మేతకోసం తీసుకువచ్చిన సందర్భంలో.. అటవీశాఖ అధికారులు తమపై దాడి చేశారని పశువుల కాపర్లు ఆరోపించారు. పశువుల కాపరి వెంకటేశ్వర్లును అటవీశాఖ అధికారులు కొట్టడంతో గాయాలయ్యాయని మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే అటవీశాఖ అధికారులు తమపైనే పశువుల కాపర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 23, 2024
ఎందుకు నన్ను చూస్తే భయమేస్తోంది: తాటిపర్తి
కూటమి ప్రభుత్వం ఆర్థిక దోపిడీ చేయడానికి PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘పీయూసీ కమిటీ మెంబర్‌గా నామినేషన్ వేసిన నేనంటే చంద్రబాబు కుమారుడికి ఎందుకంత భయం? ఎందుకు ఇన్నిన్ని కేసులు పెడుతున్నారు? దళితులకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా? మాదిగ జాతి బిడ్డలను ఇలా హింసించడం దారుణం. చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీస్తాం’ అని ఎమ్మెల్యే హెచ్చరించారు.