News January 7, 2025
సంతబొమ్మాళి: ఉరేసుకొని పోర్టు కార్మికుడి మృతి

సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో సోమవారం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు వావిలపల్లి సురేశ్(25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మడకముడిగాం గ్రామానికి చెందిన యువకుడు పోర్టులో భోజనాలు అందించే వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని సంతబొమ్మాళి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.
Similar News
News January 27, 2026
పలాస: కుటుంబ కలహాలతో యువకుడి హంగామా

పలాస కేటీ రోడ్డు ఇందిరా చౌక్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం ఉదయం <<18971917>>మద్యం మత్తులో ఓ యువకుడు<<>> తన చేయిని కోసుకొని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి యత్నించి భయాభ్రాంతులకు గురి చేశాడు. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలాస రాజాం కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కుటుంబ కలహాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
News January 27, 2026
శ్రీకాకుళం: యాక్సిడెంట్.. రైస్ మిల్లర్ మృతి

నరసన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ వెంకటరమణ (67) విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం తన కుమార్తె ఇంటి వద్ద నుంచి మార్కెట్‌కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 27, 2026
పోలమాంబ సిరిమాను సంబరం నేడే..!

మక్కువ(M) శంబర శ్రీ పోలమాంబ తల్లి సిరిమానోత్సవానికి అధికారులు అన్నీ సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. తొలుత పూజారిని చదురు గుడి నుంచి భుజాలపై మోసుకొని మంగళవాయిద్యాల నడుమ వెళ్లి సిరిమాను అధిరోహిస్తారు. భక్తులు అరటి పండ్లు, చీరలు, కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లిస్తారు.


