News March 20, 2025
సంతమాగులూరు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి చెందిన ఘటన సంతమాగులూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టావారి పాలెం గ్రామానికి చెందిన షాహినా బేగం(68) అనే వృద్ధురాలు హైదరాబాదు నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో ప్రయాణికులు 108కి సమాచారం ఇవ్వగా, అప్పటికే మృతి చెందిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 20, 2025
నూజివీడు: గేట్ 2025లో త్రిబుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నాలుగు త్రిబుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు గేట్ 2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచినట్లు ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. గేట్‌లో వెయ్యిలోపు ర్యాంకులను 30 మంది విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన అమిరెడ్డి అశోక్ జాతీయస్థాయిలో 12వ ర్యాంకు సాధించాడని వివరించారు.
News March 20, 2025
బాపట్ల: వ్యవసాయ కళాశాలలో రైతులకు శిక్షణ

బాపట్ల ఆచార్యఎన్.జి రంగా వ్యవసాయ కళాశాలలో పురుగుమందుల వాడకంపై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి, కీటక శాస్త్ర విభాగం డీన్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నకుమారి, పురుగు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రభావం గురించి తెలిపారు. ఇంకొల్లు మండలానికి చెందిన కొనికి, హనుమాజి పాలెం, సూదివారిపాలెం గ్రామాల రైతులు పాల్గొన్నారు.
News March 20, 2025
బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలంటూ శాసనసభలో తీర్మానం చేసింది. దీనికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది.