News May 24, 2024
సంతమాగులూరు: చికిత్స పొందుతూ మహిళ మృతి

మండలంలోని ఏల్చూరులో బాల ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద గురువారం చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన అంకంశెట్టి పున్నాయమ్మ దీపారాధన చేస్తూ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు నరసరావుపేట వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 19, 2026
24న ఒంగోలులో సైక్లింగ్ పోటీలు

ఒంగోలు మిని స్టేడియంలో ఈనెల 24వ తేదీ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారని జిల్లా క్రీడాధికారి సంస్థ అధికారిణి జి.రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారి నుంచి మాస్టర్స్ వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.
News February 19, 2026
పొదిలి: ఒక్కో ప్లేట్‌కు రూ.50.. మిమ్మల్నీ అడిగారా?

పొదిలిలో విద్యుత్ సర్వీసు నంబర్ ప్లేట్లు బిగించి ప్రతి ఒక్కరి వద్ద రూ.50 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పాత ప్లేట్ ఉన్నప్పటికీ.. తప్పనిసరిగా కొత్త ప్లేట్ పెట్టాలంటూ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా.. తమకు సంబంధం లేదని.. ప్రైవేట్ కాంట్రాక్టర్ వాటిని బిగిస్తున్నారని చెప్పారు.
News February 19, 2026
ప్రకాశం: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ ఒంగోలులో ….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.


