News January 17, 2025

సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఫిబ్రవరి 13, 14, 15వ తేదీల్లో సేవాఘడ్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రెవెన్యూ భవనంలో ఫిబ్రవరిలో గుత్తి పరిధిలో నిర్వహించే సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు.

Similar News

News February 14, 2026

అనంతపురం జిల్లాకు బడ్జెట్ కేటాయింపులపై ఉత్కంఠ

image

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం విశేషం. జిల్లాకు చెందిన మంత్రి కావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కీలక ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News February 14, 2026

అనంతపురం: ‘మాతా, శిశు మరణాలు నివారించాలి’

image

అనంతపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా జరగరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్, డిసెంబర్-2025 త్రైమాసిక సమీక్షలో 6 మాతృ మరణాలపై కూలంకషంగా చర్చించారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు పూర్తి పర్యవేక్షణ, టీనేజ్ గర్భధారణ నియంత్రణ, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.