News January 3, 2026
సంపత్‌కుమార్‌కు సీఈగా పదోన్నతి

శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కొమ్ము సంపత్‌కుమార్ పదోన్నతి పొందారు. ఆయనను చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా నియమిస్తూ సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కదిరి ప్రాంతానికి చెందిన సంపత్‌కుమార్ తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. జిల్లాలో సమర్థవంతంగా సేవలు అందించిన ఆయనకు పదోన్నతి లభించడం పట్ల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Similar News
News January 9, 2026
వీఆర్‌ఓల పనితీరులో మార్పు అవసరం: కలెక్టర్

ఐవీఎస్ సర్వేలో 13 మంది వీఆర్‌ఓలు కేవలం 50 శాతం మాత్రమే పనితీరు కనబరిచిన నేపథ్యంలో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం లేకుండా, సమయానికి అందించాలని వీఆర్‌ఓలను ఆదేశించారు. సంబంధిత వీఆర్‌ఓలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పనితీరులో స్పష్టమైన మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ గంగధర్ గౌడ్ ఉన్నారు.
News January 9, 2026
వరంగల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వంట సిబ్బంది తొలగింపు

వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట చేసే సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 9, 2026
జగిత్యాల: ‘కోర్టులు – పోలీస్ సమన్వయం అత్యవసరం’

న్యాయవ్యవస్థను ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలంటే కోర్టులు – పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పెండింగ్ క్రిమినల్ కేసులు, చార్జ్‌షీట్ల దాఖలు, సమన్లు, ఎన్‌బీడబ్ల్యూ అమలు, సాక్షుల హాజరు వంటి అంశాలపై చర్చించారు. లోక్‌అదాలత్ ద్వారా 1051 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.


