News October 22, 2024
సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మారుద్దాం: చిత్తూరు కలెక్టర్

చిత్తూరును సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చుదామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యులు, భోజన నిర్వాహకులు, ఆయాలు, హెల్పర్లు, వాచ్మెన్ తదితరులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.
Similar News
News February 15, 2026
చిత్తూరు జిల్లాలో రేపు సెలవు.. కానీ!

మహా శివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు సోమవారం ఆప్షన్ హాలిడే ఇస్తున్నామని డీఈవో రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పాఠశాలలకు సెలవు ఉన్నప్పటికీ.. టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశించారు. హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు కచ్చితంగా పాఠశాలకు హాజరై టెన్త్ విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని సూచించారు.
News February 15, 2026
చిత్తూరు: నేటి చికెన్ ధరలు ఇలా..!

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122 నుంచి రూ.128, మాంసం రూ.177 నుంచి రూ.195 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.75గా ఉంది. శివరాత్రి పర్వదినం కావడంతో ఆదివారం అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెప్పారు. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 14, 2026
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.


