News March 2, 2025
సంబేపల్లిలో దారుణ హత్య

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేని వార్ల పల్లెలో వారాధి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 6, 2025
సమన్వయంతో అధికారులు పనులు పూర్తి చేయాలి: మేయర్

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగరమంతా సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అంశాలు అడిగి తెలుసుకున్నారు.
News November 6, 2025
విశాఖలో ప్రశాంతంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్‌ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
News November 6, 2025
పున్నమి వెలుగుల్లో వేములవాడ రాజన్న ఆలయం..!

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం పున్నమి వెలుగుల్లో కాంతులీనుతోంది. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా పున్నమి చంద్రుడు మరింత ప్రకాశవంతం కావడంతో ఆ వెలుగులు రాజన్న ఆలయంపై ప్రసరించి ఆలయ ప్రాంగణం మరింత ద్విగుణీకృతంగా కనిపిస్తోంది. పట్టణానికి చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ రాజయ్య కెమెరాకు చిక్కిన ఈ చిత్రం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. SHARE IT


