News April 1, 2025
సంబేపల్లె: ‘పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత’

పాడిరైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపల్లెలో పశువుల తాగునీటి తొట్టెలు, సేద్యపు నీటి కుంటల నిర్మాణ పనులకు అధికారులతో కలసి భూమిపూజ చేశారు. వేసవిలో భూగర్భ జలాల పెంపునకు ఫారం పాండ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 2, 2025
వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.
News April 2, 2025
హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం

TG: హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి మృత్యువాత పడినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్‌ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.
News April 2, 2025
MBNR: ఖబర్దార్ రేవంత్ రెడ్డి: డీకే అరుణ

‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూములు వేలం వేయడం సరికాదు..ఆ భూములు ఎవరి జాగిరు కాదు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.