News January 9, 2026

సంస్కృతి ప్రతిబింబించేలా మేడారం జాతర: CMO

image

గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం జాతరను నిర్వహించాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు సూచించారు. మేడారం ఐటీడీఐ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని, సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. జాతరలో 8 జోన్లు, జోనుకు 8 మంది అధికారులు, 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 20, 2026

జగిత్యాలలో ఐపీఆర్‌పై అవగాహన కార్యక్రమం

image

జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కుల(IPR)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ MSME ఇన్నోవేటివ్ పథకం కింద ఐపీఆర్ ప్రాముఖ్యత, పేటెంట్లు, ట్రేడ్‌మార్కుల వినియోగంపై నిపుణులు వివరాలు వెల్లడించారు. MSME పథకాలు, మహిళా వ్యాపారవేత్తలకు లభించే అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, వ్యాపార ఆసక్తిగలవారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

News February 20, 2026

ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్: కేంద్రమంత్రి

image

ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్ అయిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సదస్సుకు ఐదు లక్షల మందికిపైగా విజిటర్స్ వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మౌలికవసతుల్లో $250 బిలియన్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా డేటా సెంటర్స్, సెమీకండక్టర్ ఫెసిలిటీస్‌కు సంబంధించిన పెట్టుబడులే ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే ఏఐ మిషన్ 2.0 ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

News February 20, 2026

జగిత్యాల: యువతకు వాయుసేన అగ్నివీర్ అవకాశాలపై అవగాహన

image

వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరేందుకు ఉన్న అవకాశాలపై జగిత్యాలలోని SKNR కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ అధికారి సందీప్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 17½ నుంచి 21 ఏళ్ల యువత అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. మహిళా అభ్యర్థులకు మార్చి 9న, పురుష అభ్యర్థులకు మార్చి 15న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓపెన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.