News September 5, 2025
సంస్కృత ఉపాధ్యాయుడు నుంచి.. ప్రభుత్వ ఆస్థానకవి వరకు

‘అవధాని శిరోమణి’ బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసుడు, అనేక భాషలు నేర్చిన పండితుడు చతుష్షష్ఠి కళలన్నీ నేర్చిన మహా మనీషి కాశీ కృష్ణాచార్యులు (1872-1967. గుంటూరు హైస్కూలులో సంస్కృత పండిత పదవిని నిర్వహించారు. 1961లో ఏపీ ప్రభుత్వ ఆస్థానకవి పదవిని చేపట్టి 1967లో మరణించేవరకు కొనసాగారు. 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. మొదటి అష్టావధానం వినుకొండలో జరిగింది.
Similar News
News September 5, 2025
టీచర్స్ డే.. మీ అనుభవాలు?

ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం పిల్లలకు మరపురాని వేడుకగా నిలుస్తుంది. ఉదయం విద్యార్థులు స్వయంగా గురువుల వేషధారణలో స్కూల్ కి వచ్చి తరగతులను నిర్వహించేవారు. పాఠశాల ప్రాంగణం నవ్వులు, ఆటపాటలతో మార్మోగేది. బహుమతులు, శుభాకాంక్షలతో గురువులను సత్కరించడం విద్యార్ధులకు ఆనందం. ఈ వేడుకలు గురువు – శిష్య బంధానికి చిహ్నంగా నిలుస్తుంది. మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా COMMENT చేయండి.
News September 5, 2025
రెవెన్యూ కల్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు: DEO

గుంటూరు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 9 మంది ప్రధానోపాధ్యాయులకు, తత్సమాన కేటగిరీలో 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు, 25 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.
News September 4, 2025
గుంటూరు జిల్లా మత్స్య శాఖ అధికారిగా కిరణ్ కుమార్

గుంటూరు జిల్లా మత్స్య శాఖ అధికారిగా పి.ఎన్.కిరణ్ కుమార్ గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు పొన్నూరు మత్స్య కేంద్రంలో ఎఫ్‌డీఓ లాబ్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదోన్నతిపై రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు జిల్లా మత్స్య శాఖ అధికారిగా బాధ్యతలు సేకరించారు. మత్స్య శాఖ అభివృద్ధికి తన వంతు సహాయ సహకరాలను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.