News October 26, 2025

సకాలంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతులను కల్పించాలని ఆయన సూచించారు.

Similar News

News October 26, 2025

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌: అజీజ్

image

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమిద్ యాక్ట్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదర్సాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.

News October 25, 2025

కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

News October 25, 2025

రిజిస్ట్రేషన్స్ కోసం వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి : జిల్లా రిజిస్ట్రార్

image

ప్రభుత్వం ఎవ్వరినీ దస్తావేజు లేఖరులుగా నియమించలేదని, లైసెన్స్ ఇవ్వలేదని ప్రజలు తమకు తామే IGRS (www.registration.ap.gov.in) వెబ్ సైట్లో ఉన్న నమూనాలను ఉపయోగించుకుని దస్తావేజులు తయారు చేసుకోవచ్చని జిల్లా రిజిస్ట్రారు బాలాంజనేయులు తెలిపారు. చలానాలు చెల్లించి ప్రజలకు కావలసిన సమయంలో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా సబ్-రిజిస్ట్రార్లని సంప్రదించి తమ దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.