News April 6, 2025
సఖినేటిపల్లి: కచ్చడా చేప రేటు అదుర్స్.. రూ.70 వేలు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌కు 25 కిలోల కచ్చడా చేప శనివారం మత్స్యకారులు తీసుకువచ్చారు. వేలంలో ఆ చేప రూ.70 వేల ధర పలికింది. దీంతో ఆ చేప చిక్కిన మత్స్యకారుల పంట పండింది. ఇది ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ చేప అని తెలిపారు. ఈ చేపకు ఇంత ధరా? అంటూ ఆశ్చర్యపోయిన స్థానికులు చేప వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకున్నారు.
Similar News
News April 7, 2025
MNCL: 7న BRS ముఖ్య కార్యకర్తల సమావేశం

బెల్లంపల్లి పట్టణం AMC గ్రౌండ్ క్వార్టర్ నంబరు3లో ఈనెల 7న జరగనున్న నియోజకవర్గం BRS ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
News April 7, 2025
ADB: మహిళల బంగారు పుస్తెల తాళ్లు చోరీ: CI

పండుగ సందర్భంగా గుడికి వెళ్లిన మహిళల మెడల్లో నుంచి పుస్తెల తాళ్లు చోరీ అయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల మేరకు.. తిర్పల్లికు చెందిన ఠాకూర్ పద్మజ, మావలకు చెందిన సుమ బ్రాహ్మణ సమాజ్ రామమందిర్‌లో పూజకు వెళ్లారు. క్యూలైన్లో నిలబడి భోజనాలు చేశారు. అనంతరం చూసుకుంటే పద్మజ, సుమ మెడలోని బంగారు పుస్తెల తాళ్లు కనబడలేదు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 7, 2025
ADB: వారంలో 8 సైబర్ మోసాలు: SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ ఫ్రాడ్, మొబైల్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఎటువంటి గుర్తు తెలియని స్కాం నంబర్లు, లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.